ఢిల్లీలో యువతిపై మరోఘోరం!

Rape
Rape

ఢిల్లీ: రాజధానిలోని రోహిణి సబర్బ్‌ప్రాంతంలో ఒక యువతిపై అత్యాచారం చేయడంతోపాటు ఆ ఘనకార్యాన్ని వీడియోలతో సోషల్‌మీడియాలో విస్తృత ప్రసారంచేసనిందుకుగాను పోలీసులుముగ్గురిని అరెస్టుచేసారు. ఈ పిన్నవయసు యువతి తల్లి ఈ సంఘటనపై ఫిర్యాదుచేసింది. అంతేకాకుండా వీడియోల వ్యవహారాన్ని పొరుగుననే ఉన్న వ్యక్తి అప్రమత్తంచేయడంతో వెనువెంటనే తల్లి ఫిర్యాదుచేసింది. మంగోల్‌పూర్‌కలాన్‌ ప్రాంతంలో రెండువారాలక్రితమే ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు 32 ఏళ్ల కార్మికుడని తేలింది. ఆతను సైతం ఈ బాలికకు పొరుగుననే నివసిస్తున్నాడు. ప్రలోభాలకు గురిచేసి తన ఇంటికి పిలిపించుకుని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారంచేసాడు. ఈ ఘనకార్యం జరుగుతుండగానే నిందితుడి స్నేహితులు మొబైల్‌ఫోన్లలో చిత్రించారు. ఎవ్వరికైనా చెపితే వీడియోలు బైటపెడతామని బెదిరించారు. ఇంటర్నెట్‌లో పెట్టి సర్క్యులేట్‌ చేస్తామని ఆమెను బెదిరించారు. వాట్సాప్‌లో సైతం వీటిని పంపిణీచేస్తామన్నారు.అయితే ఈ వీడియోలు లీక్‌అయి పొరుగువ్యక్తులుచూడంతో బాలికతల్లికి చెప్పారు. బాలికను పిలిచి గట్టిగా మందలిస్తే ఆమె ఏడుస్తూ మొత్తం చెప్పింది. వెనువెంటనే బాలికతల్లి పోలీసులకు పిర్యాదుచేయడం,బాలికను వైద్యపరంగాపరీక్షలు నిర్వహించడంజరిగింది. కతువాలో ఎనిమిదేళ్ల బాలికపైజరిగిన ఘోరకలి ముగియకముందే దేశరాజధానిలోమరో అఘాయిత్యం వెలుగులోనికి వచ్చింది. అలాగే యుపిలోని బిజెపి ఎమ్మెల్యే స్వయంగా ఒకయువతిపై అత్యాచారంచేసిన సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుచూసాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ముగ్గురునిందితులు సోమవారం అరెస్టు అయ్యారు. ఐపిసిలోని వివిధ సెక్షన్లతోపాటు పోక్సో చట్టం, ఐటి చట్టం పరిధిలోకూడా రిజిష్టరుచేసారు. అనుమానితుల ఇళ్లపై దాడులుచేసి వారిని అరెస్టుచేసామని, ఈ మొబైల్‌ఫోను స్నేహితుల్లో ఒకడిదని డిప్యూటి కమిషనర్‌ రజనీష్‌ గుప్తా వెల్లడించారు. ప్రధాన నిందితుని కుటుంబసభ్యులు ఈ యువతి తల్లిపై ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని వత్తిడితెస్తున్నారు. నిందితుడు పరపతి కలిగిన వాడని, ఆయన కుటుంబసభ్యులకు ఆప్రాంతంలో మంచి పట్టు ఉందని చెపుతున్నారు. ఈప్రాంతం వీడి వెళ్లిపోవాలనిసైతం బాలిక తల్లిని హెచ్చరిస్తున్నట్లు సమాచారం.