ఢిల్లీలో పతాకస్థాయిలో విద్యుత్‌ వినియోగం

Transmission
Transmission

న్యూఢిల్లీ: వేసవి తాపంతో అట్టుడికిపోతున్న ఢిల్లీలో విద్యుత్‌ వినియోగం డిమాండ్‌అత్యంత గరిష్టస్థాయికి చేరింది. రాష్ట్రంలోని లోడ్‌ పంపిణీ కేంద్రం గణాంకాలనుచూస్తే వేసవిలో రోజుకు 6934 మెగావాట్ల వినియోగం ఉన్నట్లు తేలింది.ఈనెల ఒకటవ తేదీ గరిష్టంగా విద్యుత్‌ డిమాండ్‌ 6651 మెగావాట్లకు చేరింది. అంతకుముందున్న రికార్డు 6526 మెగావాట్లను అధిగమించింది. అత్యధిక విద్యుత్‌ లోడును చూస్తే 6934మెగావాట్లుగా శుక్రవారం నమోదయింది. రానురాను ఢిల్లీలో రోజువారి విద్యుత్‌ వినియోగం ఏడువేల మెగావాట్లకుసైతం చేరుతుందని మంత్రి సత్యేందర్‌జైన్‌ వెల్లడించారు. వేసవిలో పెరుగుతున్న డిమాండ్‌ను అధిగమించేందుకు వసరమైనంతగా విద్యుత్‌నిల్వలున్నాయని మంత్రి వివరించారు. విద్యుత్‌ సరఫరా వేసవిలో పంపిణీకిగాను నిర్దిష్టమైన ప్రణాళిక అమలుచేసామన్నారు. జూన్‌నెలలో విద్యుత్‌ డిమాండ్‌ ఏడువేలయూనిట్లకు చేరుకోగలదని అన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆరువేల మెగావాట్లను ఎనిమిదిసార్లు దాటిందని అన్నారు. విద్యుత్‌ డిమాండ్‌ రెండుసార్లు మేనెలలోనే ఆరువేల మెగావాట్లను దాటింది. నగర విద్యుత్‌డిమాండ్‌ 6600 మెగావాట్లు దాటినట్లు రాజధాని పంపిణీ వ్యవస్థ వెల్లడించింది. బిఎస్‌ఇఎస్‌ డిస్కమ్‌, ఇఆర్‌పిఎల్‌ ప్రాంతాలు దక్షిణ, పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో 2745 మెగావాట్లుగా ఉన్నాయని ఈ సారి 2880 మెగావాట్లకు పెరిగిందని అన్నారు. బివైపిఎల్‌ ప్రాంతాలు తూర్పు, మధ్యఢిల్లీ ప్రాంతాల్లో విద్యుత్‌ డిమాండ్‌ 1469 మెగావాట్లుగా గత ఏడాది ఉంటే ఈ ఏడాది 1670 మెగావాట్లుగా ఉన్నట్లు మంత్రి వివరించారు. టాటాపవర్‌ డిడిఎల్‌ ఉత్తర, వాయవ్యఢిల్లీకి విద్యుత్‌ పంపిణీచేస్నుత్నది. ఈ సారి 1850 మెగావాట్లనుంచి 2200 మెగావాట్లకు చేరిందని అంచనా.