ఢిల్లీలో కుప్పకూలిన మూడంస్థుల భవనం

BUILDING COLLAPSE
BUILDING COLLAPSE

న్యూఢిల్లీ: మూడంస్థుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని అశోక్‌ విహార్‌ ఫేజ్‌ సవాన్‌ పార్క్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.