ఢిల్లీలో కారు పార్కింగ్ నాలుగు రెట్లు

car parkling
car parkling

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కారు పార్కింగ్ రేట్లను నాలుగు రెట్లు పెంచారు. వాయు కాలుష్య నివారణ చర్యలలో భాగంగా వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గించే ఉద్దేశంతో ఢిల్లీ కార్పొరేషన్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు నియమించిన వాతావరణ కాలుస్య నియంత్ర అథారిటీ (ఈపీసీఎ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్య పరిస్థితిపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  అత్యవసర పరిస్థితిగా పరిగణించాలని పేర్కొంటూ కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను నివేదించాల్సిందిగా యూపీ, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది.