టోల్‌ ప్లాజాల వద్ద విఐపిల వాహనాలు ఆపడం బాధాకరం

Madras-High-Court
Madras-High-Court

చెన్నై: వీఐపిలకు, జడ్జిల కొసం దేశవ్యాప్తంగా టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్‌ను ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల సంస్థకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టోల్‌ గేట్ల వద్ద విఐపి, సిట్టింగ్‌ జడ్జీల వాహనాలను నిలపడం బాధకలిగిస్తుందని, ప్లాజాల వద్ద జడ్జీలను కూడా 15 నిమిషాల పాటు ఎదురుచూసేలా చేయడం దురదృష్టకరమని కొర్టు అభిప్రాయపడింది. రమేశ్‌, మురళీధరన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అన్ని టోల్‌ ప్లాజాలకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనం..నేషనల్‌ హైవే అథారిటీని ఆదేశించింది. సర్క్యులర్‌ ఇవ్వకుంటే అధికారులకు షోకాజ్‌ నోటీసులు ఇస్తామని కోర్టు హెచ్చరించింది.