టోల్‌ ప్లాజాల వద్ద ఈ-టోల్‌ కలెక్షన్‌: మంత్రి గడ్కరీ

Nitin Gadkari
Nitin Gadkari

ముంబాయిః టోల్‌ ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ యంత్రాంగాన్నిన ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. జాతీయ రహదారులపై టోల్‌ వసూళ్ల విధానంలో కొత్తదనం రాబోతుంది. వచ్చే నెల నుంచి అన్ని టోల్‌ ప్లాజాల వద్ద  ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. డిజిటలైజేషన్‌ నగదు రహిత లావాదేవీల నిర్వహణ పట్ల ప్రభుత్వం చేస్తున్న యత్నాల గురించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ వివరించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై నగదు రహిత టోల్‌ వసూలు సలభంగా జరిగేందుకు వీలుగా డిసెంబర్‌ 1 తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలన్నింటికీ ఎఫ్‌ఏఎస్‌ ట్యాగ్‌లు ఉన్నట్లు తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఈ సంఖ్య 25లక్షలు పెరుగుతుందన్నారు. రాబోయే రెండు నెలల్లో దేశంలో 3,800 రహదారులను ఎఫ్‌ఏఎస్‌ట్యాగ్‌ అనువుగా మార్చుతామని తెలపారు. ఈ విధానంలో రోజుకు రూ.10కోట్ల ఆదాయం వస్తోందని, ఇది వచ్చే మార్చి నాటికి 30 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.