టెన్త్ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం

చండీగఢ్(హర్యానా): హర్యానాలోని సోనిపట్ జిల్లా గోహన నగరంలో పదహారేళ్ళ బాలికపై ఒక స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి ప్రిన్సిపాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పదో తరగతి పరీక్షలలో ఉత్తీర్ణురాలిని చేస్తానని మాయ మాటలు చెప్పి బాలికపై అత్యాచారం జరిపినట్లు బుధవారం వెలువడిన ఒక వార్తా కధనం పేర్కొంది. వాస్తవానికి ఈ సంఘటన మంగళవారం జరిగింది.