జోసఫ్‌ పదోన్నతికే కొలీజియం తీర్మానం

Joseph
Joseph

జోసఫ్‌ పదోన్నతికే కొలీజియం తీర్మానం

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కెఎంజోసెఫ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాల్సిందేనని సుప్రీంకోర్టు కొల్లిజియం ఏకగ్రీవంగా నిర్ణయించింది. కేంద్రం ఆయన పేరును తిప్పిపంపించిన తర్వాత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన పనిచేసే కొల్లిజియం కేంద్రం నిర్ణయంపై రాజీలేదని, జస్టిస్‌ జోసెఫ్‌నే సుప్రీం న్యాయమూర్తిగా నియ మించాలని మరోసారి కేంద్రానికి పంపించేందుకు నిర్ణయించింది. ఉత్తరాఖండ్‌ హైకోర్టులో నిర్వహించిన బెంచ్‌లో 2016లో నరేంద్రమోడీప్రభుత్వం ఉత్తరా ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై వ్యతిరేక తీర్పునివ్వడమే ప్రస్తుతం ఆయన పదోన్నతికి ఆటంకం అయిందని న్యాయనిపుణులు చెపుతున్నారు. 2017లో కాంగ్రెస్‌ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయింది. గం టకుపైగా సమావేశం అయిన ఐదుగురుసభ్యులకొల్లిజయంలో చీఫ్‌జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ జె.చలమేశ్వర్‌, రంజన్‌గగో§్‌ు, ఎంబిలోకూర్‌, కురియన్‌ జోసెప జోసెఫ్‌పేరును నిర్ణయించారు. ఆయన పేరును ఇతర హైకోరు ్టప్రధాన న్యాయమూర్తుల పదోన్నతుల జాబితాలతో కలిపి పంపించాలని నిర్ణ యించింది. మొత్తం 11మంది న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు నియమిం చేందుకు కొల్లిజియం ప్రతిపాదనలు పంపించిన సంగతి తెలిసిందే. మరోసారి జోసెఫ్‌ అంశంపై చర్చించేందుకు ఈనెల 16వ తేదీ సమావేశం కావా లని నిర్ణయించింది.