జైపూర్‌లో ఈడీ విచారణకు వాద్రా

Robert Vadra
Robert Vadra

జైపూర్‌: కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్డ్‌ వాద్రా ఆయన తల్లి మౌరీన్‌ వాద్రాతో కలిసి ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. రాజస్థాన్ సరిహద్దు పట్టణం బికనీర్‌లో భూకుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై వాద్రా, ఆయన తల్లిని ఈడీ విచారిస్తోంది. కాగా జైపూర్‌లోని ఈడీ జోనల్ కార్యాలయానికి ఈ ఇద్దరితో పాటు వాద్రా భార్య ప్రియాంక గాంధీ కూడా తోడుగా వచ్చారు. వాద్రా ఈడీ ముందుకు రావడం ఇది నాలుగోసారి కాగా  జైపూర్‌లో విచారణకు హాజరుకావడం ఇదే తొలిసారి.