జూలై నుంచి ఉదయ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

Udaya Express Double dekkar Train
Udaya Express Double dekkar Train

జూలై నుంచి ఉదయ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ వచ్చే జూలై నుంచి ఉత్కృష్ట డబుల్‌ డెక్కర్‌ ఎసి యాత్రి (ఉద§్‌ు) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించనుంది.. ఢిల్లీ-లక్నో వంటి రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్ల్లో ఈ రైళ్లను నడుపుతారు.. సాధారణ రైళ్లలోని 3ఎసి తరగతి టిక్కెట్ల ధరకంటే ఈ డబుల్‌ డెక్కర్‌ రైళ్లలో టికెట్‌ ధర తక్కువగా ఉంటుంది.. రాత్రివేళల్లో నడిచే ఈరైళ్లలో ప్రయాణికులు సౌకర్యంగా కూర్చోవచ్చు. కానీ పడుకోవటానికి బెర్త్‌ల సౌకర్యం ఉండదు.. ఆహారం, కాఫీ మొదలైనవితీసుకోవటానికి వీలుగా ఫుడ్‌ వెండింగ్‌ యంత్రాలను అమరుస్తున్నారు.. గంటకు 110 కిమీ వేగంతో నడిచే ఈ రైళ్లను గురించి 2016-17 బడ్జెలోనే ప్రస్తావించారు.