జాతీయ గీతాన్ని అవ‌మాన‌ప‌రిచారంటూ విద్యార్థుల‌పై కేసు న‌మోదు!

Indian Flag
Indian Flag

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని బాబా గులాంషా బాద్‌షా విశ్వవిద్యాలయంలో జాతీయ గీతాన్ని అవమానపరిచేలా వ్యవహరించారంటూ ఇద్దరు విద్యార్థులపై కేసు నమోదైంది. విశ్వవిద్యాలయంలో బుధవారం ఓ కార్యక్రమం జరిగింది. జమ్ము కశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వొహ్రా ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో తొలుత జాతీయ గీతాలాపన చేశారు. ఆ సందర్భంలో ఇద్దరు విద్యార్థులు లేచి నిలబడకుండా జాతీయ గీతాన్ని అవమానపరిచేలా వ్యవహరించారు. దీంతో వారిపై కేసులు నమోదుచేసినట్టు జిల్లా మెజిస్ట్రేట్‌ షాహిద్‌ ఇక్బాల్‌ చౌదరి తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేప‌ట్టామ‌ని, దీనికి సంబంధించి యూనివర్సిటీ ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరినట్టు ఆయ‌న
తెలిపారు.