జమ్ముకశ్యీర్‌ గవర్నర్‌ తో మాట్లాడిన రాజ్‌ నాథ్‌ ఆరా

Rajnath Singh
Rajnath Singh

న్యూఢిల్లీ : జమ్ముకశ్యీర్‌ హైవే మార్గంలో సీఆర్పీఎఫ్‌ 54వ బెటాలియన్‌కి చెందిన జవాన్లు ప్రయాణిస్తుండగా జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డ ఘటనపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా తీశారు. జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీఆర్పీఎఫ్ డీజీతోనూ రాజ్ నాథ్ ఫోన్ లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ రేపు శ్రీనగర్ కు వెళ్లనున్నారు. జమ్ముకశ్మీర్ లో పరిస్థితులను సీనియర్ సీఆర్పీఎఫ్ అధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమీక్షిస్తున్నారు.