చార్జీల తగ్గింపుతో రూ.900 కోట్లు ఆదా!

EPFO
EPFO

న్యూఢిల్లీ: ఉద్యోగులభవిష్యనిధి సంస్థ పరిపాలనాఛార్జిలను తగ్గించడంతో దేశంలోని ఐదులక్షల యాజమాన్యాలు సుమారు రూ.900 కోట్లు సాలీనా ఆదాచేస్తాయి. తాజాగా భవిష్యనిధి సంస్థ జూన్‌ ఒకటవ తేదీనుంచి అమలుకు వచ్చేవిధంగా పరిపాలన ఛార్జిలను 0.5శాతం తగ్గించింది. అంతకుముందున్న 0.65శాతంనుంచి 0.50శాతానికి తగ్గించాలనినిర్ణయించింది. మొత్తం యాజమాన్యాలు చెల్లించే వేతనాలనుంచి ఈ తగ్గింపు ఉంటుంది. దీనివల్ల ఉద్యోగుల యాజమాన్యాలు కార్మికుల ఉపాధిని సామాజిక భద్రత పథకాల కిందకు తెచ్చే వీలుటుందని సిపిఎఫ్‌ఒ కమిషనర్‌ విపిజా§్‌ు వెల్లడించారు. అయితే ఈ విధానం వల్ల రూ.900 కోట్లు యాజామాన్యాలు సాలీనా ఆదాచేసుకుంటాయి. ఇపిఎఫ్‌ఒ ఇప్పటివరకూ పాలనా ఛార్జిలరూపంలోయాజమాన్యాలనుంచి రూ.3800 కోట్లు వసూలుచేసింది. ఇపిఎఫ్‌ఒ నిర్వహించే సామాజికభద్రత పథకాలకోసం వీటిని ఖర్చుచేస్తుంది. అంతేకాకుండా ఇపిఎఫ్‌ఒవద్ద రూ.20వేల కోట్లవరకూ ఈ ఛార్జిల వసూళ్లు పేరుకున్నాయి. వీటిపై వడ్డీ సాలీనా రూ.1600 కోట్లు ఆర్జిస్తోంది. ఇపిఎఫ్‌ఒ పాలనాఛార్జిలు తగ్గించడం వల్ల ఇపిఎఫ్‌కు పరిహారంచెల్లించేవారి బేస్‌సైతం పెరుగుతున్నది. ఇపిఎఫ్‌ఒ పాలనాఛార్జిలను 1.10శాతంనుంచి 0.85శాతానికి 2015జనవరి ఒకటవ తేదీనుంచి తగ్గించింది. తదనంతరం 2017 ఏప్రిల్‌ ఒకటవ తేదీనుంచి 0.65శాతంకు తగ్గించింది. తాజాగా 0.50శాతానికి తగ్గిచడం వల్ల యాజమాన్యాలకు ఎంతో వెసులుబాటు అవుతుంది. ఇపిఎఫ్‌ఒ చందాదారులు సుమారు ఐదుకోట్లకుపైగా ఉంటే కార్పస్‌ మొత్తం రూ.10 లక్షలకోట్లుగా ఉన్నట్లు అంచనా.