గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో 9 మంది మృతి

gas cylinder blast
gas cylinder blast

అజ్మీర్‌: రాజస్థాన్‌లోని బేవార్‌లో శనివారం మధ్యాహ్నం ఘోరప్రమాదం జరిగింది. నంద్‌నగర్‌లో జరుగుతున్న ఓ పెళ్లి వేడుకలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు మహిళలు ,చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులను తరలించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు ధాటికి పక్కనున్న భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు.