గొంతు కోసినా..మేము ముస్లింలమే

Asaduddin
Asaduddin

న్యూఢిల్లీ: హర్యానాలో బలవంతంగా ఓ ముస్లిం యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు ..గడ్డం గీయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపి అసదుద్దీన్‌ ఓవైసి సోమవారం ఉదయం స్పందించారు. ఇటీవలే ముస్లిం యువకుడికి గడ్డం గీయించిన వ్యక్తులకు , వారి తల్లిదండ్రులకు తాను చెప్పేది ఒక్కటే..మీరు మా గొంతు కోసినా కూడా..తాము ముస్లింల లాగేనే ఉంటామని ఓవైసి తేల్చి చెప్పారు. తాము మిమ్మల్ని ఇస్లాం మతంలోకి మార్చి గడ్డం పెంచామని చెబితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.