గుట్కా స్కాంలో మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు

CBI
CBI

చెన్నై: ఈరోజు తమిళనాడులో మంత్రి సహా పలువురు ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. కోట్ల రూపాయల విలువైన చెన్నై గుట్కా కుంభకోణంలో సంబంధం ఉందనే అనుమానంతో సీబీఐ సోదాలు చేస్తుంది. తమిళనాడులో నమిలే పొగాకు ఉత్పత్తులను నిషేధించినప్పటికి అమ్మకాలు కొనసాగుతుండటం పై ఈ ఏడాది ఏప్రిల్‌లో మద్రాస్‌ హైకోర్టు ఈ అంశంపై విచారణ జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. ఇప్పుడు సీబీఐ ఆ దిశగా సోదాలు ప్రారంభించింది.