గవర్నర్‌ రోశయ్య ప్రసంగంతో ప్రారంభమైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు

Rosaiah
చెన్నై : తమిళనాడు 15వ శాసనసభ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఆ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర శాసనసభకు గత నెలలో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 6వ మారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో 15వ శాసనసభ తొలి సమావేశంలో రాష్ట్ర గవర్నర్‌ రోశయ్య ప్రసంగంతో సమావేశం ప్రారంభమయింది. గురువారం ఉదయం 11 గంటలకు గవర్నర్‌ తన ప్రసంగాన్ని ఆంగ్లంలో ప్రారంభించగా, స్పీకర్‌ ధనపాల్‌ తమిళ అనువాదాన్ని శాసనసభలో చదివారు. కొత్త ప్రభుత్వం తరపున తయారు చేసిన గవర్నర్‌ ప్రసంగంలో పలు కొత్త పథకాలు, వాటి తీరు గురించి వివరించారు.