గవర్నర్‌ను క‌లిసిన‌ ఒమర్‌ అబ్దుల్లా

Omar Abdullah
Omar Abdullah

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో రాజకీయాలు ఉత్కంఠ రెకెత్తిస్తున్నాయి. పిడిపి-బిజెపి కూటమి నుంచి బిజెపి వైదొలగడంతో మెహబూబా ముఫ్తీ తన రాజీనామా పత్రాన్ని దాఖలలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షనేత ఒమర్‌ అబ్దుల్లా గవర్నర్‌తో భేటీ అయ్యారు. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 87కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 44మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి. పిడిపి 28, బిజెపి 25, ఎన్‌సి 15, కాంగ్రెస్‌ 12, ఇతరులు 7, ముఫ్తీ రాజీనామా నేపథ్యంలో రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.