క‌మ‌ల్ పార్టీ పేరు మక్కళ్ నీతి మయ్యమ్

Kamal hassan
Kamal hassan

చెన్నై: సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్.. తన పార్టీ పేరును ప్రకటించారు. కమల్ పార్టీ పేరు మక్కళ్ నీతి మయ్యమ్(సెంటర్ ఫర్ పీపుల్స్ జస్టిస్). మదురై బహిరంగ సభలో.. అశేషంగా కదలివచ్చిన అభిమాన జనసందోహం ముందు తన పార్టీ పేరు ప్రకటించారు. పార్టీ పేరుతో పాటు జెండాను కూడా ఆవిష్కరించారు. ఈ సభకు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమిళ తల్లి పాటతో సభ ప్రారంభమైంది.