కోల్‌కతాలో అగ్ని ప్రమాదం!

kolkata
kolkata

కోల్‌కతా: ఈరోజు ఉదయం 7.30 ప్రాంతంలో కోల్‌కతా వైద్య కళాశాల ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆస్పత్రిలో 250 మంది రోగులను సెలైన్‌ సీసాలు, స్ట్రెక్చర్‌లతో సహా హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందులో మరి కొందరిని ఇతర ఆస్పత్రులకు పంపించారు. ఘటానాస్థలికి చేరుకున్న పది అగ్ని మాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.