కేసులను ఉపసంహరించేందుకు కమల్‌నాథ్‌ సుముఖత

kamal nath, maya wati
kamal nath, maya wati

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరు గారుస్తున్నారన్న ఆరోపణలపై గత ఏడాది ఏప్రిల్‌ 2న జరిగిన భారత్‌ బంద్‌ సందర్భంగా పలువురిపై రాజకీయ దురుద్ధేశంతో నమోదు చేసిన కేసులను ఉపసంహరించేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. 2018 భారత్‌ బంద్‌ సమయంలో కాకుండా గత 15 ఏళ్లుగా బిజెపి ఇదే తరహాలో నమోదు చేసిన కేసులన్నింటిని ఉపసంహరించనున్నట్లు మధ్యప్రదేశ్‌ న్యాయశాఖ మంత్రి పిసి శర్మ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. భారత్‌ బంద్‌ సందర్భంగా అమాయక ప్రజలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ బహుజన్‌ సమాజ్‌ పార్టీ సుప్రీం మాయావతి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలను సోమవారం నాడు ఒక పత్రికా ప్రకటనలో హెచ్చరించారు.