కేర‌ళ‌కు ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ సాయం

AR Murugadoss
AR Murugadoss

చెన్నైః కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు తమ వంతు సాయంగా సినీ దర్శకుడు మురుగదాస్‌ రూ. 10 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేరళ ముఖ్య మంత్రి విపత్తు నివారణ నిధి పంపించారు. అదే విధంగా , నటుడు జయంరవి కూడా రూ.10లక్షల విరాళం ప్రకటించారు. సీనియర్‌ నటుడు రాధారవి నేతృత్వంలో ఆయన అనుచరులు కేరళకు నిత్యావసర వస్తువులు, దుస్తులను పంపించారు. కమల్‌హాసన్‌ బాటలోనే శివకార్తికేయన్‌ అభిమానులు కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సేకరించిన బియ్యం, దుస్తులు, ఇతర ఆహార పదార్థాలను కేరళ బాధితుల కోసం తరలిస్తున్నారు. అలాగే నగరానికి చెందిన అయ్యప్ప సేవా సమాజం రూ.5లక్షలు విరాళం అందజేసింది.