కేరళ వరద బాధితులకు రాజ్యసభ ఎంపీల విరాళం

VENKAIAH NAIDU
VENKAIAH NAIDU

న్యూఢిల్లీ: ఇటీవల కేరళలో వరదలు భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భీకర వర్షాల వల్ల ఆ రాష్ట్రం దారుణంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఎంపి ల్యాడ్స్‌ నిధుల నుంచి కొందరు ఎంపీలు కేరళ వరద బాధితలుక విరాళం ఇచ్చారు. ఇవాళ రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆ విషయాని ప్రకటించారు. రాజ్యసభకు చెందని ఎంపీలు సుమారు 38 కోట్లను కేరళ వరద బాధితలుకు విరాళంగా ఇచ్చినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. విరాళం ఇచ్చిన వారికి వెంకయ్య కృతజ్ఞతలు చెప్పారు.