కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల గృహరుణాల ప‌రిమితి పెంపు

cash
cash

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్ర‌భుత్వం శుభ‌వార్త అందించింది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సొంత ఇంటికల నెరవేర్చుకునేందుకు మార్గం
మరింత సుల‌భం అయ్యింది. గృహరుణాల పరిమితిని భారీగా పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. గృహాలు నిర్మించుకునేందుకు లేదా కొనుగోలు చేసేందుకు ఉద్యోగులు ఇకపై రూ.25 లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చు. 7వ వేతన సంఘం సిఫారసులను మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలను సవరించినట్టు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. గతంలో ముందస్తు గృహ రుణపరిమితి కేవలం రూ.7.5 లక్షలుగా మాత్రమే ఉండేది. కాగా ఇప్పుడు గృహ రుణాలపై వడ్డీరేటును కూడా భారీగా తగ్గించారు. గతంలో నాలుగు శ్లాబుల కింద 6 నుంచి 9.5 శాతం వరకు ఉండగా.. తాజాగా అన్ని గృహరుణాలపై ఏకరీతిన 8.5 శాతం వడ్డీ వసూలు చేయనున్నారు.