కేంద్ర‌మంత్రిని క‌లిసిన ఎంపీ వినోద్‌

Vinod Kumar
Vinod Kumar

న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దిప్ సింగ్‌‌పూరీని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కలిశారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు నిధులు విడుదల చేయాలంటూ తాను కోరినట్లు వినోద్ తెలిపారు. ఈ విషయంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వినోద్ మీడియాతో మాట్లాడుతూ 7మాసాల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ రాష్ట్ర ప్రభుత్వం సాయంతో స్పెషల్ పర్పస్ దక్కిందని అన్నారు. తర్వాత ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సాల్టెంట్ కూడా టెండర్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. దానికి సరిపడ నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రిని కలిసినట్లు వినోద్ చెప్పారు. ఈ విషయమై ఆయన సానుకూలంగా స్పందించారని, పనులు ప్రారంభిస్తే నిధులు విడుదల చేస్తామని హర్దిప్ హామీ ఇచ్చారని వినోద్ పేర్కొన్నారు.