కేంద్రాన్ని ప్రశ్నించిన అసదుద్దీన్‌

 

asaduddin owisi
asaduddin owisi

కల్యాణ్‌: మహారాష్ట్రలోని కల్యాణ్‌ నగరంలోని వంచిత్‌ బహుజన్‌ సభలో ఒవైసీ మాట్లాడుత భారతరత్న అవార్డుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో భారతరత్న అవార్డును బీఆర్‌ అంబేద్కర్‌కు బలవంతంగా ఇచ్చారు. కాని హృదయపూర్వకంగా ఇవ్వలేదన్నరు. కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్నను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజికవేత్త నానాజీ దేశ్ ముఖ్లకు ఇచ్చిన నేపథ్యంలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని కల్యాణ్ నగరంలో వంచిత్ బహుజన్ సభలో ఒవైసీ మాట్లాడారు. ఇప్పటి వరకు ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, పేదలు, అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకు భారతరత్న అవార్డులు ఇచ్చారని ఆయన  కేంద్రాన్ని ప్రశ్నించారు.