కుంభమేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సియం

KUMBHAMELA
KUMBHAMELA

అలహాబాద్‌: అలహాబాద్‌ లో వచ్చే సంవత్సరం జనవరి 15 నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది.కేవలం సాంప్రదాయ వాదులే కాదు,పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక ప్రముఖులు ఎందరో ఆ సంగం దగ్గర గుమికూడతారు. అదే సంవత్సరం ఎన్నికల సంవత్సరం కావడంతో రాజకీయ కొలాహలం ఉండనుంది. ఈ కుంభమేళా లో ఎంతో మంది వివిధరంగాలైన అధ్మాత్మికం,రాజకీయ,వ్యాపార,టూరిజం,ప్రపంచంలోని కొన్ని దేశాల వారు అందరికీ ఈ మేళా ఇక వేదిక కానుంది. కాగా ప్రపంచంలోని ప్రముఖ ప్రాంతాలలో ఈ ఉత్సవాల విశిష్టతను ను తెలియచేయడానికి ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకోనుంది. వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్‌ టూరిజం శాఖ బెర్లిన్‌,అమ్‌స్టర్‌ డ్యాం, లిస్బన్‌, డబ్లిన్‌, కోపెన్‌హాగెన్‌ మొదలైన ప్రాంతాలలో రోడ్‌ షోలు ఏర్పాటుచేయడానికి ఆ శాఖ సిద్దమైందని ప్రాంతీయ టూరిజం అధికారి అనుపమ్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. గంగ,యమునా,సరస్వతి నదుల సంగమ తీరాన సాధుపుంగవులు, ఆద్యాత్మిక గురువులు,మొదలైన వారు మతం పై చర్చ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, వ్యాపార వేత్తలు పెట్టుబడులపై చర్చించడం, పర్యాటకులు అధ్యాత్మిక అనుభూతిని పొందడం వంటి సంఘటనలకు ఈ సంగమం ఆనవాలుగా నిలువనుందని విశ్లేషకులు తెలియచేస్తున్నారు. ఈ మెగా కుంభమేళా జనవరి 15 న మొదలై మార్చి 4న ముగుస్తుందని, ఈ మేళా కు 120 మిలియన్ల యాత్రికులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యు.కె.) జనాభాకు రెట్టింపని తెలిపారు. ప్రపంచ పర్యాటకులకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారని, దాదాపు రెండు మిలియన్ల విదేశీయులు ఈ మేళాలో పర్యటిస్తారని కుంభ్‌ మేళా అధికారి విజ§్‌ు కిరణ్‌ ఆనంద్‌ తెలిపారు. మహా కుంభ మేళా విశిష్టత, ఇక్కడి చరిత్ర, సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు,మొదలగు వాటి పై విదేశీయులకు సులభంగా అర్థమయ్యేందుకు ఆయా దేశాల మాతృ భాషల్లో కర పత్రాలు ముద్రించనున్నారు. స్పానిష్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌ మొదలగు భాషల్లో ప్రచురించనున్నారు. లండన్‌ లో ఒక ప్రత్యేకమైన వరల్డ్‌ ట్రావెల్‌ మార్ట్‌ స్టాల్‌ ను నవంబరు 5-7 తేదీలలో ఏర్పాటు చేయనున్నారని శ్రీవాస్తవ వెల్లడించారు.నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్ల (ఎన్‌ఆర్‌ఐ) ల కోసం ఒక ప్రత్యేక కాలనీ ని ఏర్పాటు చేయనున్నారు.ఈ మహా కుంభ మేళా గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్కృతంగా ప్రచారం చేయడానికి ప్రింట్‌ మీడియా, ఎలZకానిక్‌ మీడియా లలో ప్రచారానికై ఉత్తర ప్రదేశ్‌ సమాచార శాఖ 50 కోట్ల బడ్జెట్‌ విడుదల చేయనున్నది. ఈ మహా మేళా కు విదేశీయులు రానున్న నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ 192 దేశాల రాయబారులతో డిశంబరు మూడవ వారంలో సంగం తీరాన సమావేశం కానున్నారు. వారణాసి లో రెండు రోజుల ఎన్‌ఆర్‌ఐ సమావేశం నిర్వహించనున్నారు. ప్రపంచ స్థాయిలో జరగే ఈ ఉత్సవాలను ప్రధాని మోదీ, యు.పి. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. అదే సంవత్సరం లోకసభ ఎన్నికలు జరుగ నుండటంతో ఎలాంటి లోటు పాట్లు లేకుండా జాగ్రత్తగా పర్యవేక్షించనున్నారు. కాగా ఈ మేళా సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించడానికి ప్రధాని మోదీ నవంబర్‌ లో అలహాబాద్‌ లో పర్యటించనున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ స్వయంగా సన్యాసి కావడం, అంతేగాక ఘోరఖ్‌నాథ్‌ ఆలయ పెద్దగా కూడ ఉన్నారు. ఈ ఏర్పాట్లను సమీక్షించడానికి ఆయన ఇప్పటికే అలహాబాద్‌ లో నాలుగు సార్లు పర్యటించారు.