కావేరి జ‌ల బోర్డు ఏర్పాటు చేప‌ట్టాలి

KAMAL HASSAN
KAMAL HASSAN

చెన్నై: కావేరీ బోర్డు ఏర్పాటు చేయకపోతే సహాయ నిరాకరణోద్యమం చేస్తామని సినీనటుడు, రాజకీయ నాయకుడు కమల్‌హాసన్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఉద్యమం తమిళనాడు నుంచే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కావేరీ నదీ యాజమాన్య బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్రం వైఖరి సరిగా లేదని విమర్శించారు. కావేరీ జలమండలి బోర్డు ఏర్పాటు చేయాలని గత కొద్దిరోజులుగా తమిళనాడులో అధికార అన్నాడీఎంకేతో పాటు పలు పార్టీలు, రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.