కాలువల నిర్మాణానికి షిర్డి ట్రస్టు రూ.500 కోట్లు

shirdi temple
shirdi temple

షిరిడి(మహారాష్ట్ర): షిరిడిసాయిబాబా దేవస్థానం మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.500 కోట్ల రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఇందుకు సంబంధించి దేవాలయ పాలకవర్గం సీనియర్‌ అధికారి ఒకరు మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి మరాట్వాటా ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్‌ అధికారులతో ఆదివాచం ఎంఒయు చేసుకుంది. ఒక డ్యామ్‌కు సంబంధించి కాలువల నిర్మాణానికి గాను ఈ నిధులు వెచ్చించాల్సి ఉంది. నీల్‌వాండే డామ్‌ ప్రవరా నదవిపై నిర్మించారు. మొత్తం 182 గ్రామాలకు ఈ డ్యామ్‌మేలుచేస్తుంది. సంగమ్నర్‌, అకోల్‌, రహతా, రహూరి, కొపరగాంవ్‌ తహసీళ్లలోని గ్రామాలకు అందుబాటులో మంచినీటిపారుదల ఉంటుంది. షిరిడిట్రస్టు రూ.500 కోట్లు ఈప్రాజెక్టుకు ఇస్తుంది. అయితే ఈమొత్తంపై ఎలాంటి వడ్డీ వసూలుచేయదు. అయితే చెల్లింపులు ఎప్పటిలోపు తిరిగి ప్రభుత్వం ట్రస్టుకు అందిస్తుందన్న వివరాలను మాత్రం ఇవ్వలేదు. దేవాలయ ట్రస్టుబోర్డు ప్రతి ఏటా సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదలచేస్తుందని ఈసారి నీల్‌వాండే డ్యామ్‌కు పెద్ద మొత్తంలో అందించడం అరుదైన విషయమని చెపుతున్నారు. రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు మాట్లాడుతూ నీల్వాండే డ్యామ్‌కు ఇప్పటినుంచే నీటిని నిల్వచేస్తున్నామని, అయితే డ్యామ్‌ కుడి ఎడమ కాలువల నిర్మాణంజరగాల్సి ఉంది. అప్పుడే ఈ నీటిని సాగునీరు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. నీల్‌వాండేడామ్‌ ఈ ఏడాదిజూన్‌లో 2232కోట్లు ప్రధానమంత్రి కృషి సంజీవని యోజన కింద నిధులు రాబట్టింది. షిరిడి కేంద్రంగా ఉన్న సాయిబాబా మందిర్‌ట్రస్టు అంతకుముందుకూడా మహారాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌కంపెనీకి రూ.50 కోట్లు నిధులు అందచేసింది. రూ.350 కోట్లవిలువైన ఎయిర్‌పోర్టు నిర్మాణానికి నిధులు సమకూర్చింది. కాకడి గ్రామంలో ఏర్పాటుచేసిన ఈ ఎయిర్‌పోర్టు ఇపుడు కార్యకలాపాలు సాగిస్తోంది.