కారవాన్‌పత్రికపై వివేక్‌దోవల్‌ పరవునష్టం కేసు

vivek doval
vivek doval

న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం నమోదు
న్యూఢిల్లీ: జాతీయ భద్రతాసలహాదారు అజిత్‌దోవల్‌ తనయుడు వివేక్‌దోవల్‌ తనపరువుకు భంగం కలిగిస్తూ కథనాలను ప్రచురించారని కారవాన్‌ వెబ్‌ పత్రికపై తన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట నమోదుచేసారు. డికంపెనీలు ఒక హెడ్జ్‌ఫండ్‌ సంస్థను నిర్వహించిందని, అదికూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీప్రబ్తువం 2016లో చేసిన పెద్దనోట్ల రద్దు తర్వాత 13రోజులకు రిజిస్టరుచేసినట్లు వార్తాకథనం ప్రచురించారు. కారవాన్‌మ్యాగజైన్‌లో తనపై పరువునష్టం కలిగిస్తూ వచ్చిన వ్యాసంపై ఆయన కేసును దాఖలుచేసారు. ఇదే కథనాన్ని కాంగ్రెస్‌నాయకుడు జైరామ్‌రమేష్‌ తనకు అనుకూలంగా మార్చుకుని విమర్శలుచేసారని ఆరోపించారు. అదనపు చీఫ్‌మెట్రోపాలిటన్‌మేజిస్ట్రేట్‌ సమర్‌ విశాల్‌ ఎదుట దోవల్‌ వాంగ్మూలాన్ని రికార్డుచేసారు. తనపై అవాస్తవాలు నిరాధారమైన కథనాలు ప్రచురించి తన ప్రతిష్టకు భంగం కలిగించారని, కుటుంబసభ్యులు, వృత్తిపరమైన సహచరుల్లో కూడా తనను కించపరిచారని పేర్కొన్నారు. వాంగ్మూలం నమోదుచేసిన తర్వాత కోర్టు ఈకేసును ఫిబ్రవరి 11వ తేదీకి వాయిదావేసింది. వివేక్‌దోవల్‌తోపాటు మరో ఇద్దరు సాక్షులు నిఖిల్‌కపూర్‌, బిజినెస్‌ భాగస్వామి అమిత్‌శర్మలు కూడా తమతమ వాంగ్మూలాలను క్రిమినల్‌ పరువునష్టం ఫిర్యాదుకు మద్దతుగా ఇచ్చారు. మ్యాగజైన్‌తోపాటు జైరామ్‌రమేష్‌ ఇద్దరూ తనను ప్రజల్లో కించపరిచేవిధంగా చేసి తన తండ్రితో ఉన్న వైరుద్యాలను పరిష్కరించుకోవాలనిచూస్తున్నారన్నాఉ. కారవన్‌ తన జనవరి 16వ తేదీ ఆన్‌లైన్‌ వెర్షన్‌లో ది డి కంపెనీస్‌ పేరిట కథనం ప్రచురించింది. వివేక్‌దోవల్‌ కేమెన్‌ ఐలాండ్స్‌లో ఒక హెడ్జ్‌ఫండ్‌ను నిర్వహిస్తోందని, పన్ను ఎగవేతలకు ఇదొక స్వర్గధామంగా నిలిచిందని పేర్కొన్నది. అంతేకాకుండాసెద్దనోట్ల రద్దుకు 13రోజుల తర్వాత మాత్రమే రిజిష్టరుచేసిందని పేర్కొన్నది. జైరామ్‌రమేష్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో తనపై నిరాధారమైన, వాస్తవాలు కాని అంశాలను ప్రస్తావించారని,దీనివల్ల ప్రజల్లోను పాఠకుల్లోను తనను అగౌరవపరిచేవిధంగా వార్తలనుప్రచురించారని అన్నారు. రాజకీయంగా కూడాఈ వ్యాసాన్ని వాడుకుని రాజకీయంగాప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారన్నారు.