కామాంధుడికి పోలీసుల సంకెళ్లు

Arrest
Arrest

ముంబై: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసిన కరడుకట్టిన కామాంధుడిని ముంబై పోలీసులు ఎట్టకేలక పట్టుకున్నారు. అయితే ముంబైలోని నాయనగర్‌లోని వుడ్‌ ల్యాండ్‌ సొసైటిలో నివాసముంటున్న ఖురేషి బిల్డర్లకు భవన నిర్మాణ సామాగ్రిని పంపిణి చేస్తుంటాడు. దీనికోసం ఇతను నిత్యం నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద తిరుగుతుండేవాడు. ఖురేషి ఒంటరిగా ఉన్న బాలికలను చూసి మీతండ్రి పిలుస్తున్నాడని చెప్పి వారిని నిర్జన భవన నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళ్లి వారిపై అఘాయిత్యం చేశాడు. ఇలా నవీముంబై, థానే, థానే రురల్‌, పాల్ఘార్‌ జిల్లాల్లో 17 మంది బాలికలపై ఖురేషి అఘాయిత్యాలు చేశాడని ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు చెప్పారు.