కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై సస్సెన్షన్‌ వేటు

kulbir singh zira
kulbir singh zira

చండీగఢ్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కుల్బీర్‌సింగ్‌ ఝిరాపై ఆ పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే కల్బీర్‌సింగ్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేకు నోటీసులు కూడా జారీ చేసింది. క్రమశిక్షణ చర్యల కింద కుల్బీర్‌సింగ్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు పంజాబ్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ జఖర్‌ వెల్లడించారు.