కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ దినేశ్‌…

Rahul gandhi & Dinesh
Rahul gandhi & Dinesh

బెంగుళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు దినేశ్‌ గుండురావు నియమితులు అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ ఆయనను నియమించారు. ప్రస్తుతం బెంగుళూరులో గాంధీనగర్‌ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన దినేశ్‌, లోగడ ఆహార,పౌరసరఫరాల శాఖమంత్రిగా పనిచేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గుండురావు కుమారుడు దినేష్‌. జెడిఎస్‌-కాంగ్రెస్‌ పొత్తు ప్రభుత్వం ఏర్పడటంతో కెపిసిసి అధ్యక్షుడిగా ఉన్న పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. తదనంతరం ఆయన కెపిసిసి పదవికి రాజీనామా చేయాల్సి ఉంది.