కనిమొళిపై మండిపడుతున్న బిజెపి

kanimozhi
kanimozhi

కనిమొళిపై మండిపడుతున్న బిజెపి

తిరుపతి: తిరుమల వేంకటేశ్వర స్వామిపై వ్యాఖ్యలు చేసిన డీఎంకె నాయకురాలు కనిమొళికి భారతీయ జనతాపార్టీ (బీజేపీ)తో పాటు హిందు ధర్మ సంఘాలు మండిపడుతున్నాయి. వేంకటేశ్వర స్వామి వారి గురించి తెలియని ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన నాస్తిక సమాజం మహానాడులో ఆమె వేంకటేశ్వర స్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను పేదవారు దర్శించుకోవాలంటే పడిగాపులు కాయాలని, ఆయన కోటీశ్వరులకే దేవుడని అన్నారు. వేంకటేశ్వర స్వామికి శక్తులే ఉంటే, ఆయన హుండీకి భద్రతెందుకు, ఆయన హుండీనికూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారనే వ్యాఖ్యలు చేశారు. వేంకటే శ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు రోజుకు 60 వేల నుంచి 70 వేల మంది వస్తారనే విషయం తెలిసిందే. అంత మంది భక్తుల మనో భావాలను ఆమె దెబ్బ తీశారని భక్తులు ఆరోపిస్తు న్నారు. ఆమె వైఖరిని కొంత మంది బీజేపీ నేతలు తూర్పారబడ్డారు. తమిళనాడుకు చెందిన పలువురు నేతలుకొన్నివిషయాలను ‘ప్రభాత వార్తతో పంచుకున్నారు.

”డీఎంకె అధ్యక్షుడు కరుణానిధి కుమార్తె అయిన కనిమొళి కుటుంబ సభ్యులు తరుచు హిందు ఆలయాలను సందర్శి స్తూనే ఉంటారు. 2002వ సంవత్సరంలో సత్య సాయిబాబా చెన్నైకు వెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు ఆయనఉన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి ఆయనను తనఇంటికి అతిధిగాఆహ్వానించారు. సాయిబాబా కూడా కరుణానిధి ఇంటికి వెళ్లి, వారికుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆ సమయంలో అక్కడ కనిమొళి కూడా అక్కడే ఉన్నారు. నాస్తికురాలైన కనిమొళి ఆయన వద్దకు ఎందుకు వెళ్లారని తమిళనాడులోని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా కరుణా నిధి ఇంట్లోని వారందరూ శ్రీవారి భక్తులే అన డానికి కొన్ని సంఘటనలు తెలియజేశారు. ”వీరు తరుచు తిరుమలకు రావడం జరుగు తుంది.

కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ సతీ మణి దుర్గా స్టాలిన్‌ చెన్నైలోని టీటీడీ సమా చారం కేంద్రంలో ఉన్న శ్రీవారి ఆలయానికి వెళుతూ ఉంటారు. కరుణానిధికి ఆనారోగ్యంగా ఉన్న సమయంలో ఆయన సతీమణి దయాళు అమ్మాళ్‌ తన కుటుంబంతో కలసి తిరుమలకు వచ్చారు. స్టాలిన్‌ సన్నిహితుడైన జనార్ధన్‌ రెడ్డి అనే వ్యక్తి వీరిని తిరుమలకు తీసుకుని వచ్చిన సంఘటనలు ఉన్నాయి.ఈనేపథ్యంలో కనిమొళి శ్రీవారి గురించి గర్హితమైన వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తిరుపతి ఎస్పీకి బిజెపి ఫిర్యాదు శ్రీవారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకె నాయకురాలు కనిమొళిపై తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ, తిరుపతి అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు చేసిన బిజెపి అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామిపై తమిళనాడు రాజ్యసభ సభ్యురాలు కనిమొళి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆమెపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తిరుపతి అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.