కనిమొళిని కలిసిన టిడిపి ఎంపీలు

KANIMOZHI
KANIMOZHI

చెన్నై: టిడిపి ఎంపీలు సోమవారం చెన్నైలోని డిఎంకే ఎంపి కనిమొళిని కలిశారు. మోది ప్రభుత్వంపై టిడిపి ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కనిమొళిని కలిసిన ఎంపీల్లో సియం రమేష్‌, టిజి వెంకటేష్‌, మురళీమోహన్‌ ఉన్నారు. నవ్యాంధ్ర సమస్యల పరిష్కారం, విభజన చట్టం హామీల అమలులో కేంద్రం మొండి వైఖరిని నిరసిస్తూ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో టిడిపి ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలంటూ చంద్రబాబు రాసిని లేఖను కనిమొళికి అందజేశారు. ఏపికి కేంద్ర ప్రభుత్వం ఎలా అన్యాయం చేసిందో టిడిపి ఎంపీలు వివరించారు.