ఒడిశా సియంపై చెప్పుల దాడి

navin patnaik
navin patnaik

భువ‌నేశ్వ‌ర్ః ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి బార్‌ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. బేజీపూర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక నేపథ్యంలో కుంభారి గ్రామంలో నిర్వహించిన మీటింగ్‌లో నవీన్ పట్నాయక్ ప్రసంగిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి చెప్పులతో దాడి చేశాడు. చెప్పుల దాడి నుంచి సీఎం తప్పించుకున్నారు. అప్రమత్తమైన ఇతర నేతలు, కార్యకర్తలు.. చెప్పులతో దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని చితకబాదారు. ఈ వ్యక్తిని బీజేపీకి కార్యకర్తగా గుర్తించారు.