ఏప్రిల్‌ 3న నిర్మలా రష్యా పర్యటన

Nirmala Sitharaman
Nirmala Sitharaman

మాస్కో: భారత రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏప్రిల్‌ 3నుండి రష్యాలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ భద్రతపై ఇక్కడ జరిగే 7వ మాస్కో సదస్సుకు ఆమె హాజరు కానున్నారు. నిర్మలా సీతారామన్‌ రక్షణమంత్రి హోదాలో రష్యా పర్యటించడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌ 3 నుంచి 5వరకు మూడు రోజుల పాటు ఆమె రష్యాలో పర్యటిస్తారని ఇక్కడి భారత దౌత్య కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.