ఎస్‌బిఐ ఖాతా ర‌ద్దుకు ఛార్జీల్లేవ్‌

SBI
SBI

ముంబ‌యిః ఎస్‌బీఐలో ఖాతా రద్దు చేయాలంటే ఇప్పటి వరకు జీఎస్టీతో కలిసి రూ.500లు వసూలు చేసేవారు. అక్టోబరు 1 నుంచి ఆ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. అయితే ఏడాది పూర్తయిన సాధారణ పొదుపు ఖాతా, ప్రాథమిక పొదుపు ఖాతాలకు మాత్రమే ఈ సౌలభ్యం వర్తింప చేయనున్నట్లు నిబంధన పెట్టింది. గతంలో ఎస్‌బీఐ ఖాతా రద్దు చేయాలంటే బ్యాలెన్స్‌లో రూ.500లు మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని ఖాతాదారుడికి ఇచ్చేవారు.‘ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీస మొత్తాన్ని నిర్వహించాలని ఎస్‌బీఐ ఇటీవల నిబంధన తీసుకొచ్చింది. అయితే చాలామంది ఖాతాదారులు ఆ నిబంధనను పాటించడం లేదు. దీంతో వారికి జరిమానా విధిస్తున్నాం. అందువల్ల చాలామంది తమ ఖాతాలను రద్దు చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. అలాంటి వారికి ఇబ్బంది కలగకూడదనే ఛార్జీలను తొలగిస్తున్నాం.’ అని ఎస్‌బీఐ అధికారులు తెలిపారు.