ఎయిర్‌పోర్స్‌కు బోయింగ్‌ చినూక్స్‌ హెలికాప్టర్లు

IAF
IAF

న్యూఢిల్లీ: అమెరికా ఏరోస్పేస్‌ దిగ్గజకంపెనీ బోయింగ్‌ తన మొదటివిడత నాలుగుచినూక్‌ మిలిటరీ హెలికాప్టర్లను భారత వైమానికదళానికి అందచేసింది. గుజరాత్‌లోనిముంద్రా ఓడరేవులో జరిగిన ప్రత్యేకకార్యక్రమంలో ఈ అప్పగింత జరిగింది. కంపెనీ ఒకప్రకటనచేస్తూ సిహెచ్‌47ఎఫ్‌(1) చినూక్స్‌ హెలికాప్టర్లను ఛండీఘర్‌కు పంపిస్తునఆనమని, వాటిని అక్కడ భారత వైమానిక దళంలో చేరతాయని ఐఎఎఫ్‌ అధికారులు చెపుతున్నారు. చినూక్‌ హెలికాప్టర్‌ నేరుగా గాలిలోనికి ఎగిరే సామర్ధ్యంతో ఉంటుంది. బహుళ సేవలకు వినియోగిస్తారు. సైనిక బృందాల రవాణా, ఆయుధసామగ్రినిసైతం రవాణాకు ఉపకరిస్తుంది. అంతేకాకుండా మానవతాధృక్పథంతో నిర్వహించే ఉపద్రవ పునరావాస కార్యకలాపాలకు, పునరావాస శిబిరాలకు ఆహార ఉత్పత్తులు తరలించడంలోనూ, పెద్దసంఖ్యలో శరణార్ధుల తరలింపు వంటి వాటికి వినియోగిస్తున్నారు. బోయింగ్‌కంపెనీనుంచి 22 అపాచే హెలికాప్టర్లు, 15 చినూక్‌ హెలికాప్టర్లను ఎయిర్‌ఫోర్స్‌కోసం కొనుగోలుకు భారత్‌ ఆర్డర్లు ఇచ్చింది. 2015 సెప్టెంబరులోనే ఈ ఒప్పందం జరిగింది. బోయింగ్‌ తన సరఫరాచైన్‌ను భారత్‌లో 160 మంది భాగస్వాములతో ఉంది. అపాచె హెలికాప్టర్లకు జాయింట్‌ వెంచర్‌లో ఫ్యూస్‌జేగ్స్‌ను ఉత్పత్తిచేస్తోంది. భారత్‌నుంచి బోయింగ్‌ సాలీనా వందకోట్ల డాలర్ల ఉత్పత్తులను కొనుగోలుచేస్తోంది.