ఇకపై ఎఫ్‌ఎంలో ఆలిండియా రేడియో వార్తలు

all india radio
all india radio

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎం రేడియోలో ఇకనుండి వార్తలూ వినొచ్చు, ఆలిండియా రేడియో (ఏఐఆర్‌) వార్తల బులెటిన్లను ప్రైవేటు ఎఫ్‌ఎం రేడియో ఛానళ్లలో ప్రసారం చేసేందుకు అనుమతించనున్నారు. కొన్ని షరుతులు, నిబంధనలకు లోబడి వార్తలు ఆంగ్లం,హందీ భాషల్లో నిరఇ్దష్ట షెడ్యూలుకు అనుగుణంగా ప్రసారం కానున్నాయి.ఆలిండియా రేడియో వార్తల్ని ప్రైవేట్‌ ఎఫ్‌ఎం ప్రసార సంస్థలతో పంచుకునే కార్యక్రమాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాఠోడ్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం పెంచాలనేదే ప్రభుత్వ ప్రాధాన్యమని, ఆదాయ సంపాదనకు ద్వితీయ ప్రాధాన్యమని, అందుకని వార్తా సేవల్ని ఉచితంగానే అందిస్తున్నామని తెలిపారు. ఇది పౌరులకు సాధికారతను కల్పిస్తుందని, ప్రజాస్వామ్యానికి ఇంతకన్నా ఏం కావాలని వ్యాఖ్యానించారు.