ఎన్‌డిఎనుంచి తెలుగుదేశం బైటికి రాగానే కేంద్రం కక్ష

TDP MP GALLA-
TDP MP GALLA-

ఎన్‌డిఎనుంచి తెలుగుదేశం బైటికి రాగానే కేంద్రం తమపై కక్ష కట్టిందని టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ అన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్‌కు రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపి అన్యాయం చేశాయని టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ అన్నారు. విభజనకు ముందు ఎపికి హైదరాబాద్‌నుంచి సంపద ఉత్పత్తి అయ్యేదని ఆయన అన్నారు. విభజన తరువాత ఎపి అనేక రంగాల్లో తీవ్రంగా నష్టపోయిందన్నారు.అవిశ్వాస తీర్మానంపై చర్చకు తక్కువ సమయం కేటాయించడం  పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యకత్ం చేసింది. ఈ విషయాన్ని స్పీకర్ కు తెలియజేస్తూ కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అవసరమైతే అవిశ్వాసంపై చర్చను రెండు మూడు రోజులు సాగిద్దామన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్ సమిత్రా మహాజన్ భోజన విరామం తీసుకోకుండా చర్చను కొనసాగిద్దామని ప్రతిపాదించారు. సాయంత్రం ఆరుగంటల వరకూ చర్చ సాగుతుందని, అందరూ ప్రశాంతంగా పాల్గొనాలని కోరారు.