ఎన్నికల నేపథ్యంలో నేతలకు రాహుల్‌ దిశానిర్దేశం

RAHUL GANDHI
RAHUL GANDHI

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ సన్నాహక సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహులగాంధీ అధ్యక్షతన ఢిల్లీలో కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో భేటి జరుగుతుంది. అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సియంలు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. వచ్చే ఎన్నికలకు సమాయత్తంపై నేతలకు రాహుల్‌ దిశానిర్ధేశం చేయనున్నారు.