ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ నిషేదం

CEC
CEC

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ పోలింగ్ ఈ నెల 12వ తేదీన జరగనుంది. మిగతా రాష్ట్రాలకు దశల వారీగా జరగనుంది. రాజస్థాన్, తెలంగాణ శాసనసభలకు వచ్చేనెల ఏడో తేదీన జరిగే ఎన్నికలతో ఐదు రాష్ట్రాల పోలింగ్ ముగియనుంది. రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం విధించింది. 12వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి డిసెంబర్‌ ఏడో తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.