ఉన్నావ్‌లో మ‌రో ఉదంతం

Sexual Abuse
Sexual Assualt

ఓ మహిళ పట్ల ముగ్గరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించి వేధించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌లో చోటుచేసుకుంది. ఆమె భయపడుతూ తనను వదిలేయాలని వేడుకుంటున్నా ఆ యువకులు వేధింపులకు గురి చేయడమే కాకుండా వీడియో చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన సామాజికి మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. నిందితులు రాహుల్‌,ఆకాశ్‌గా పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తన ఇంట్లో ఉన్న ఆ మహిళను వారు బలవంతంగా లాక్కెళ్లి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు.