ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌ సినిమాపై నిషేధం

kedarnath movie
kedarnath movie

డెహ్రాడూన్‌: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌,సారా అలీఖాన్‌ జంటగా నటించిన సినిమా కేదార్‌నాథ్‌ ఇవాళ విడుదలైంది. ఐతే ఈ సినిమాను నైనిటాల్‌, ఉద్దమ్‌సింగ్‌ నగర్‌ జిల్లాల్లో నిషేధించినట్లు వార్తలు వచ్చాయి. సినిమాలో కల్పిత అంశాలు ఎక్కువగా ఉన్నాయని, సంస్కృతి సాంప్రదాయాలకు దగ్గరగా లేదని, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. కేదార్‌నాథ్‌ సినిమాను బ్యాన్‌ చేయాలని వేసిన పిల్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఉత్తరాఖండ్‌ రాష్ట్రం మొత్తం బ్యాన్‌ చేశారు. 2013లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో సారా అలీఖాన్‌ ఓ హిందూ అమ్మాయిలా, సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఓ ముస్లిం అబ్బాయిలా పాత్రలు పోషించారు.