ఉగ్రనిందితులకు 12రోజుల ఎన్‌ఐఎ కస్టడీ

nia
nia

న్యూఢిల్లీ: నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ముందురోజు అరెస్టుచేసిన పది మంది నిందితులకు ఢిల్లీకోర్టు ఎన్‌ఐఎ కస్టడీకి అనుమతించింది. 12 రోజులపాటు కస్టడీలో వీరిని విచారించేందుకు ఎన్‌ఐఎ కోర్టుకు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి అనుమతించారు. ఐసిస్‌ తరహా ఉగ్రవాద ముఠా ఢిల్లీ ఇతర ఉత్తర భారత్‌లోని కీలక ప్రాంతాల్లో విధ్వంసాలను సృష్టించేందుకు కుట్రపన్నిందన్న అభియోగాలపై వీరిని అదుపులోనికి తీసుకున్నారు. అలాగే కోర్టు వీరి కుటుంబసభ్యులనుసైతం కోర్టు ఆవరణలోనే కలుసుకునేందుకు అనుమతించింది. హర్కత్‌ ఉల్‌ హర్బ్‌ ఇ ఇస్లామ్‌గ్రూప్‌కు చెందిన 16 మంది సభ్యులు ఇస్లాం వ్యాప్తికోసం ఉద్యమించాలనినిర్ణయించినట్లు ఎన్‌ఐఎ అధికారులు పేర్కొన్నారు. వారిలో పది మందిని అరెస్టుచేస్తే ఐదుగురు అమ్రోహానుంచి ఐదుగురు సీలంపూర్‌, జాఫ్రాబాద్‌ ప్రాంతాలకు చెందినవారని తేలింది. మరో ఆరుగురిని ఇంటరాగేషన్‌ చేసారు.మరిన్ని అరెస్టులు జరగవచ్చని ఎన్‌ఐఎ అధికారులు వెల్లడించారు.మొత్తం 17 ప్రాంతాల్లో నిర్వమించిన దాడుల్లో ఢిల్లీపోసలులు స్పెషల్‌సెల్‌, యుపి ఎటిఎస్‌ బృందాలు పాల్గొన్నాయి. ఢిల్లీతోపాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోకూడా ఈ దాడులుజరిగాయి. అత్యంత విప్లవాత్మకభావాలున్న ఈ యువత మొత్తం 20-35 ఏళ్లమధ్యలో ఉన్నవారేనని తేలింది. ఇప్పటివరకూ ఎలాంటి కుట్రలకు పాల్పడలేదని, కుట్రలకు వ్యూహం వేస్తున్నట్లుమాత్రం ఎన్‌ఐఎ అధికారులు గుర్తించారు.