ఈ నెల 18 కమల్‌ రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన

Kamal Hassan
Kamal Hassan

చెన్నై: నటుడు కమల్‌హాసన్‌ ఈ నెల 18న రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేయనున్నారు. జనవరి 26 నుంచి ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చెన్పైలో జరుగుతున్న వికటన్‌ అవార్డుల కార్యక్రమంలో కమల్‌ స్వయంగా ప్రకటించారు. జనవరి 18న తన రాజకీయ పర్యటనలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తారు. చాలా కాలంగా ఊహాగానాలు వస్తున్నా కమల్‌ రాజకీయ ప్రవేశంపై ఇంత కాలం స్పష్టత రాలేదు. ఇప్పటికే రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో కమల్‌ కూడా ఎట్టకేలకు రాజకీయ ప్రవేశంపై స్పస్టత ఇచ్చారు. పూర్తి వివరాలు ఈ నెల 18న వెల్లడిస్తారు.