ఈసీఐఎల్ లో స్కాం

ECIL
ఈసీఐఎల్ లో స్కాం బయటపడింది. 10మంది ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోళ్లలో రూ.41కోట్ల మేర స్కాం జరిగినట్లు గుర్తించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు జర్మనీ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. రిటైర్డ్ డీజీఎం హరితో పాటు మరికొందరు అధికారులపై కేసు నమోదైంది. సెంట్రల్ విజిలెన్స్ కమిటీ ఇప్పటికే స్కాంపై విచారణ జరిపింది. 2004 నుంచి 2010 వరకు జరిగిన కొనుగోళ్ల అక్రమాలను సీబీఐ గుర్తించింది.