ఇన్‌ఫార్మ‌ర్ నెపంతో మావోయిస్టుల దుశ్చ‌ర్య‌.. ఒక‌రి హ‌తం

maoists
Maoists

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రోజుకో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. బుధవారం అర్థరాత్ర సుక్మా జిల్లాలో పటేల్ దురై అనే వ్యక్తిని ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేసిన మావోయిస్టులు.. బీజాపూర్‌లో మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భూపాలపట్నం ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో రోడ్డుని తవ్వి ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజీవ్ డివైస్(ఐఈడీ)ని పేల్చారు. విధుల్లో భాగంగా అటుగా వెళ్లిన జవానులు ఐఈడీ పేలడంతో చెల్లాచెదురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు తీవ్రగాయాలతో బయటపడ్డారు. విధుల్లో ఉన్న అధికారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన భూపాలపట్నం వైద్యశాలకు తరలించారు.