ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

Jammu
Jammu

ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాల ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. రాష్రటంలోని గోష్‌బగ్‌, షహ్‌ కోయిల్‌ మధ్య ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఒక రైఫిల్‌, ఒక పిస్తోలు స్వాధీనం చేసుకున్నారు.. కాగా నిన్న ట్రాల్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన విషయం విదితమే.. వారు ఒక కొండ గుహలో దాగి భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారని, ఆ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపిన భద్రతా దళాలు వారుదాగి కాల్పులు జరిపిన ప్రాంతాన్నికూడ విలేకరులకు చూపించారు.